తెలంగాణ రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారిని ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పేర్కొంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). అయితే.. నేడు ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అమిత్ అరోరా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే.. ఈ నేపథ్యంలో అమిత్ అరోరాను 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరుతూఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.
Also Read : Sandalwood Smuggling: పుష్ప సినిమాను తలపించిన పోలీసుల చేజింగ్.. భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అయితే.. ఈడీ సమర్పించిన ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మె్ల్సీ కవిత పేరు ఉండటం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మొత్తం 32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత రెండు ఫోన్ నంబర్లను పది ఫోన్లలో వాడినట్లు పేర్కొన్నారు ఈడీ అధికారులు.ఈ రెండు ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. కవిత, శరత్‌చంద్రా రెడ్డి, శ్రీనివాసరెడ్డి.. పౌత్ గ్రూప్‌ను నియంత్రించారని ఈడీ తెలిపింది. లైసెన్స్‌లు పొందేందుకు వీరు ముడుపులు చెల్లించినట్లు పేర్కొంది ఈడీ అధికారులు.