NTV Telugu Site icon

MLC Kavitha : తొలి మహిళగా రికార్డ్‌ సృష్టించిన ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha

Mlc Kavitha

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్-నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఆమె ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కవిత 2015 నుంచి తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా.. సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల కాలానికి 2015లో తొలిసారిగా ఈ పదవికి ఎన్నికైన కవిత, దేశంలోనే సంస్థ రాష్ట్ర విభాగానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులను కలుపుకుని మరింత కృషి చేస్తానని, రానున్న రోజుల్లో సంస్థ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు.

Also Read : Heavy Rains : న్యూజిలాండ్‎ను ముంచెత్తిన వర్షాలు.. విమాన సర్వీసులు రద్దు

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే..?

బాల బాలికలలో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి ప్రారంభించబడిన ఉద్యమం బాలభట ఉద్యమం (Scouts and Guides Movement). ఈ ఉద్యమంలో బాలుర బృందాలను “స్కౌట్స్”, బాలికల బృందాలను “గైడ్స్” అని అంటారు.

ఈ ఉద్యమాన్ని సర్ రాబర్ట్ బెడన్ పవల్ 1907 సంవత్సరం దక్షిణాఫ్రికా లో జరిగిన బోయర్ యుద్ధాలలో గాయపడిన వారికి సేవచేయడానికి ప్రారంభించాడు. అయితే పిల్లలలోని సహనం, స్నేహశీలత, ఉత్సాహం, పట్టుదలలను చూచిన పవల్ ఈ ఉద్యమాన్ని యుద్ధాల తర్వాత కూడా కొనసాగించాడు.

Also Read : NABARD Chairman: వ్యవసాయంతో పాటు మత్స్య, సహకార రంగాలకు రుణాలు

ఉద్యమంలో చేరిన పిల్లలకు సేవా పద్ధతులను అనుసరించి శిక్షణ (Training) ఇస్తారు. వీరికి ఈతకొట్టడం, వంతెనలు, రోడ్ల నిర్మాణం, ప్రథమ చికిత్స పద్ధతులను నేర్పుతారు. ఆయుధాలు లేకుండా వీరు కేవలం ఒక కర్రను మాత్రమే ధరిస్తారు. వీరికి సైనికుల వలె ప్రత్యేక దుస్తులు మెడలో ఒక స్కార్ఫ్ ఉంటుంది. ఈ ఉద్యమంలో చేరినవారు దళాలుగా ఏర్పడతారు. ప్రతి దళానికి ఒక పతాకం, వాయిద్యాలు ఉంటాయి. “సదా సమాజసేవలో ఉంటాం” అనే నినాదం ఈ పతాకం పై రాసి ఉంటుంది. ప్రతి జట్టు ఒక నాయకుడి ఆధీనంలో ఉంటుంది. ఈ ఉద్యమంలో విద్యార్ధులందరూ స్వచ్ఛందంగా చేరాలి. సత్యం పలకడం, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగగ్రస్తులకు సేవచేయడం, పోలీసు వ్యవస్థకు అత్యవసర సమయాల్లో సాయపడటం ద్వారా బాలభటులు సమాజసేవ చేయవచ్చును.