MLC Jeevan Reddy: తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్.. రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కేటీఆర్ మాట్లాడితే ఆశ్చర్యంగా అనిపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని.. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని ఆయన అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారన్నారు. కేసీఆర్ కమీషన్లలో కేంద్రానికి వాటా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్.. సీఎం రేవంత్ అంటూ ఆయన పేర్కొన్నారు. ఎవరెవరు ఒక్కటైనా రేవంత్‌ని ఏం చేయలేరన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రోత్సహించిందే బీజేపీ అని.. అనుమతుల్లేని ప్రాజెక్టులకు కేంద్రం అప్పు ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చన్నారు. కృష్ణా జలాలను కేసీఆర్ తన మిత్రుడు జగన్‌కి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపణలు చేశారు.
నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆరే, వాటికి ఆటంకాలు తెచ్చింది కేసీఆరే అంటూ ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది కేసీఆరేనని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకి ఏం కావాలని ప్రధాని అడిగితే… హామే కు కుచ్ నహీ చాహియే అని కేసీఆర్ అన్నారని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి తెలిపారు. తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి సహకరించమని కోరినప్పుడు ఆత్మ గౌరవం ఏమయిందని ప్రశ్నించారు. కేసీఆర్ అసమర్ధత వల్లనే రాష్ట్రానికి నిధులు రాలేదన్నారు. కేసీఆర్ అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు మోదీతో కేసీఆర్ సఖ్యతగా ఉన్నారన్నారు. విభజన చట్టంలోని హామీలను కేసీఆర్ తేవడంలో విఫలం అయ్యారని విమర్శింటారు. కమీషన్ల కోసం కకృతి పడేవాళ్ళు కూడా ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల కలను రేవంత్ తీరుస్తున్నారన్నారు. వైట్ రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్లకు మించినా ఉచిత కరెంట్ ఇస్తామన్నారు.
Also Read
తాజావార్తలు
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్‌కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్‌కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!