NTV Telugu Site icon

MLC Jeevan Reddy : గల్ఫ్ కార్మికుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు

Jeevan Reddy

Jeevan Reddy

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేవలం నీళ్ళు, నిధులు, నియామకాలు కోసమని, 60వేల కోట్లతో రాష్ట్ర ఏర్పాటుతో ఏర్పడిన తెలంగాణ నేడు 6లక్షల కోట్ల రూపాయల అప్పు అయిందన్నారు జీవన్‌ రెడ్డి. పుట్టబోయే బిడ్డ లక్ష యాభై వేల రూపాయల అప్పుతో పడుతున్నాడని, కమిషన్ల కక్కుర్తితో, కాళేశ్వరం దేశంలోనే తల దించుకొనెల నిర్మాణ లోపం జరిగింది. దీంతో ప్రాజెక్ట్ నీళ్ళు సముద్రం పాలైందన్నారు జీవన్‌ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహలకు లోనతున్నరని ఆయన మండిపడ్డారు.

Also Read : Sitaram Yechury: ప్రత్యేక హోదాను వెనకేసుకొచ్చిన బీజేపీ మాటతప్పింది..

అంతేకాకుండా.. ‘రెండు పర్యాయాలు ఉద్యమ నాయకుడని కేసీఆర్‌కి అధికారం ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటు ముందు రాష్ట్ర బడ్జెట్ 60వేల కోట్లు, గత సంవత్సరం 4లక్షల కోట్లు. గల్ఫ్ కార్మికుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. స్థానిక ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ సమాన విద్య తో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన మా లక్ష్యం. గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ కోట తరహా గల్ఫ్ కోట ను ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేస్తుంది. నియోజకవర్గపరిధిలో ఎమ్మెల్యే ప్రధాన పాత్ర పోషిస్తుంది… పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసే అవకాశం ఉండదు. ఎమ్మెల్సీ అనేది జెస్ట్ ఎంపిటిసి పదవి లాంటిది…నేను ప్రజాసేవ లక్ష్యంగా పని చేస్తున్న. బిల్లు రాక సర్పంచ్ పదవి చేయడానికి భయపడుతున్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుపు కాయమైపోయింది. కేసీఅర్ తిరిగి గజ్వేల్ కి పోతుండు.’ అని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : Sandra Venkata Veeraiah : సత్తుపల్లిని నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తాం