Viral: పెళ్లిచూపుల్లో ఖాకీ డ్రెస్ లో కనపడ్డ యువతి.. అనుమానంవచ్చి విచారించగా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ఎస్ఐ అంటూ చెప్పుకుంటూ చెలామణి అవుతున్న నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మాళవిక అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి బండారాన్ని బట్టబయలు చేశారు రైల్వే పోలీసులు. నార్కెట్ పల్లికి చెందిన ఈ అమ్మాయి నిజాం కాలేజ్ లో డిగ్రీ వరకు చదివింది. ఆ తర్వాత 2018లో ఆర్పిఎఫ్ ఎస్సై పరీక్షకు హాజరైంది. కాకపోతే., పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ.. కంటికి ఉన్న సమస్య కారణంతో వైద్య పరీక్షల్లో ఆమె డిస్‌క్వాలిఫై అయింది.
Also Read: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ స్టైలే వేరయా..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
అయితే తాను ఎలాగైనా సరే రైల్వేలో పోలీసు కావాలనుకున్న ఆమె ఖాకీ యూనిఫామ్ ను ధరించింది. ఆపై నార్కెట్ పల్లి గ్రామంలో ఆర్పిఎఫ్ ఎస్ఐగా ఆమె చలామణి అవుతూ వచ్చింది. తను శంకరపల్లి ఆర్పీఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మబలికింది. తరుచూ యూనిఫాంలో ఉన్న ఫోటోలను తన డీపీగా, అలాగే స్టేటస్ లో పెట్టుకోవడంతో ఆమెకు తెలిసిన వారు చాలామంది ఆ అమ్మాయి నిజంగానే ఉద్యోగం చేస్తుందని నమ్మారు.
Also Read: Dogs Shootout: పెంపుడు కుక్కని చంపడంతో.. 20 వీధి కుక్కలను అతి కిరాతకంగా..?
ఇక తాజాగా ఆమెకు ఓ పెళ్లి సంబంధం రాగా.. అబ్బాయిని చూసేందుకు సైతం యూనిఫాంలోనే వెళ్లింది. దాంతో ఆమె అసలు తంతు బయటపడింది. పెళ్లి చూపులకు కూడా యూనిఫాంలో రావటంతో అబ్బాయి తరపువాళ్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దాంతో తమకు తెలిసిన రైల్వే అధికారుల ద్వారా ఎంక్వయిరీ చేయించుకున్నారు అబ్బాయి తరపు వారు. ఎంక్వయిరీలో అసలు మాళవిక అనే రైల్వే ఎస్సై లేనే లేదని నిర్ధారణ జరిజినది. దీంతో వాలారు పోలీసులను ఆశ్రయించి అసలు విషయం తెలిపారు. ఆ తర్వాత నల్గొండలో మాళవికను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు రైల్వే పోలీసులు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!