ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అక్కడక్కడ పార్టీల నేతల మధ్య వాగ్వాదం మినహా ఎక్కడ ఘర్షణ లకు తావు లేకుండా పోలింగ్ జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 96.43 శాతం, టీచర్స్ ఎమ్మెల్సీ 91.94 శాతం, పట్టభద్రుల ఎమ్మెల్సీ 66.28 శాతం ఓట్లు పోలయ్యాయి.
Read Also:Off The Record: ఒంటరి యాత్రతో ఏం సాధించేను?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా పలుచోట్ల వైసీపీ టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మిగనూరు 261 పోలింగ్ బూత్ వద్ద ఏజెంట్ పత్రాలను పోలింగ్ అధికారులు ఇవ్వకపోవడంతో టీడీపీ నాయకులు వాగ్వివాదం దిగారు. జూపాడు బంగ్లాలో 20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.దివ్యాంగ ఓటర్ల తమ ఓటు హక్కు నియమించుకునేందుకు అధికారులు సరైన ఏర్పాటు చేయలేదు. ఎమ్మిగనూరు మాచాని స్కూల్ పోలింగ్ కేంద్రంలో అధికారులతో టీడీపీ రిలీవింగ్ ఏజెంట్లు,ఇండిపెండెంట్ అభ్యర్థుల ఏజెంట్ల వాగ్వాదానికి దిగారు. టిడీపీ రిలీవింగ్ ఏజెంట్ లకు పాస్ లు ఇవ్వలేదని ఆరోపించారు. పట్టసభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా నమూనాలో పొరపాట్లు దొర్లాయి.2023 కు బదులు 2013 గా ప్రచురించారు. అయితేబ్యాలెట్ పేపర్ లో 2023 గా కరెక్ట్ ఉందని, ఎన్నికల నోడల్ అధికారి దారువీకరించారు.
ఆదోనిలో ఐడి ప్రూఫ్ లేనందుకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఓటు వేసేందుకు ఎన్నికల అధికారి అనుమతించలేదు. దీంతో ఐడి ప్రూఫ్ తెచ్చి మరీ ఓటు వేశారు ఎమ్మెల్యే సాయిప్రసాద రెడ్డి. డోన్ లో 304 పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. టిడీపీ ఆఫీస్ ఉద్యోగి హనుమంతు ఓటు వేసేందుకు ఆధార్ జిరాక్స్ తీసుకొని రావడంతో వైఎస్సార్సీపీ నాయకులు అడ్డకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. నందికొట్కూరులో టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మండ్ర శివానందరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన సందర్భంగా టిడిపి, వైసిపి వర్గీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. లైన్ లో నిలబడకుండా ఓటును ఎలా వేస్తారని వైసిపి నేతలు నిలదీశారు.
Read Also:Hyderabad : ఉర్దూ అకాడమీలో మంటలు
శివానందరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆదోనిలో మునిసిపల్ వైస్ చైర్మన్ నరసింహులుపై దాడి చేశారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నాడని ఫిర్యాదు అందడంతో దాడి చేశారు. అదోనిలో 242 నెంబర్ పోలింగ్ బూత్ లో 4 గంటల క్యూ లైన్ లో నిలబడి భారత మహిళా క్రికెటర్ అంజలి శర్వాణి తండ్రి ఉపాధ్యాయుడు రమణ సొమ్మసిల్లి పడిపోయారు. పోలింగ్ సమయం ముగిసినా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు.