MLA Sriganesh : కేటీఆర్.. నగరాన్ని తానే తీర్చిదిద్దినట్లు గా తెగ హడావిడి చేస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో కేటీఆర్ తెగ డ్రామాలు ఆడుతున్నాడంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరాన్ని తానే తీర్చిదిద్దినట్లు గా తెగ హడావిడి చేస్తున్నాడని, హైదరాబాద్ నగర సృష్టి కర్త కేసీఆర్ అయితే తాను నగిషీలు దిద్దాను అన్నట్లు కేటీఆర్ ఫోజులున్నాయని, వినే వాళ్లు అమాయకులైతే హైదరాబాద్ నగరాన్ని కనిపెట్టింది కల్వకుంట్ల కుటుంబం అని చెపుతాడేమో అని ఆయన అన్నారు. కేటీఆర్ ఏ మొహం పెట్టుకొని నగరంలో తిరుగుతున్నాడు…? అని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ను గాలికి వదిలేసి ఇప్పుడు తెగ బడాయి కబుర్లు చెపుతున్నావు అని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న వర్షం పడితే నగరం వణికిపోయే పరిస్థితి తీసుకువచ్చారని, నాలా లు, చెరువులు కబ్జాకు గురైతే పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మీ హయాంలోనే కదా నగరం వరదల్లో మునిగిపోయిందని, ట్రాఫిక్ పైన ఏ రోజైనా దృష్టి సారించారా.. చిన్న పాటి వర్షానికే గంటల కొద్ది ట్రాఫిక్ జాం లు ఏర్పడే పరిస్థితి అని ఆయన మండిపడ్డారు. అడ్డదిడ్డంగా నాలుగు ప్లై ఓవర్లు కట్టడం తప్ప నగరానికి మీరు చేసింది ఏమిటీ…? దుర్గం చెరువు సెల్పీ పాయింట్ తప్ప కేటీఆర్ నువ్వు హైదరాబాద్ లో కట్టింది ఏమిటీ..? అని ఆయన అన్నారు.
అంతేకాకుండా..’వడ్డించిన విస్తరి లా నగరాన్ని అప్పగించి పోయామని కేటీఆర్ అంటున్నాడు… నువ్వు వడ్డించలేదు.. ఎగిలి విస్తరాకు కూడా మిగల్చకుండా నాకిపోయావు… పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించావా… పచ్చడి మెతుకులకు కూడా గతి లేకుండా చేశావు.. ఎక్కడ చూసినా పెండింగ్ బిల్లు లే.. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చావా..? కమిషన్ వచ్చే వాటికి నిధులు అడ్డదిడ్డం ఖర్చు చేయించిన ఘనత నీది… 4000 వేల కోట్లతో సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ కట్టానని గొప్పలు చెప్పుకుంటున్నావు.. నువ్వు మురికి నీళ్లు శుద్ధి చేస్తే మూసీ మురికి కూపం గానే ఎందుకు ఉంది.. మూసీ లో ఏమైనా కొబ్బరి నీళ్లు ప్రవహిస్తున్నాయా…? మా ప్రభుత్వం మూసీ ని ప్రక్షాళన చేస్తానంటే ఓర్వ లేకపోతున్నావు.. ప్రాజెక్టు డీపీఆర్ కూడా తయారు కాకుండా అవినీతి అక్రమాలు అంటు గగ్గోలు పెడుతున్నావు.. సిగ్గుండాలి…కనీసం శంకుస్థాపన కూడా జరగని ప్రాజెక్టు లో స్కాం లు అని మాట్లాడటానికి.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వల్ల నిర్వాసితులు అవుతున్న వారికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తున్నాం… సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మూసీ ప్రక్షాళన చేస్తాం.. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం… నగరంలో కేసీఆర్ ఆనవాళ్లు ఎవరూ చెరిపేయలేరని కేటీఆర్ అంటున్నాడు.. అవును.. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని చెరిపేస్తారు..
కేసీఆర్ హయాంలో అక్రమణలకు గురైన నాలా లు, చెరువు లను ఆ చెర నుంచి విడిపిస్తారు..
Also Read
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
కబ్జాలకు గురైన పార్కులు, ప్రభుత్వ స్థలాలను విడిపిస్తారు…. మీ వంకర టింకర ఆలోచనలతో రూట్ మారిన మెట్రో ను ప్రజావసరాలకు అనుగుణంగా రూట్ మార్చుతారు.. సరికొత్త ఫోర్త్ సిటీ ని సృష్టించి యువతకు మరింత ఉపాధి కల్పిస్తారు.. నగరంలో కేసీఆర్ ఆనవాళ్లు ఉన్నది ఎక్కడ…? నీ డాబు కోసం కట్టుకున్న గడీ ప్రగతి భవన్ , సెక్రటేరియట్ లో తప్ప మరెక్కడా కేసీఆర్ కనిపించడు.. అవుటర్ రింగ్ , అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, సైబరాబాద్ సిటీ , ప్లై ఓవర్లు, చెప్పుకుంటు పోతే నగరంలో కాంగ్రెస్ చేయనిది ఏమున్నది…? వాటిల్లో కేసీఆర్ ఆనవాళ్లు ఎక్కడైనా ఉన్నాయా కేటీఆర్….? హైదరాబాద్ లో మీ ఆనవాళ్లను నగర ప్రజలే తూడిపేస్తారు … పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటికే సగం తూడ్చి పారేశారు… కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి నెట్టి మీ అవసరం లేదని తేల్చారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మిమ్మల్ని మూసీ నదిలో విసిరేస్తారు… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిపాజిట్ల కోసమే కేటీఆర్ నగరంలో ఎమ్మెల్యేలను వెంటేసుకుని షో చేస్తున్నారు… కేటీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా నగర ప్రజల చైతన్యం ముందు ఉపయోగం ఉండదు.. హైడ్రా తో నగరంలో ఆక్రమణలను తొలగించి తీర్చిదిద్దుతున్న రేవంత్ రెడ్డి వెంటనే జంట నగరాలు నిలబడతాయి.. మా ముఖ్యమంత్రి పుట్ బాల్ ప్లేయర్.. ఆట ఎలా ఆడాలో తెలుసు… ఎప్పుడు గోల్ చేయాలో తెలుసు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!