హైదరాబాద్‌లో కేటీఆర్ తెగ డ్రామాలు ఆడుతున్నాడంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరాన్ని తానే తీర్చిదిద్దినట్లు గా తెగ హడావిడి చేస్తున్నాడని, హైదరాబాద్ నగర సృష్టి కర్త కేసీఆర్ అయితే తాను నగిషీలు దిద్దాను అన్నట్లు కేటీఆర్ ఫోజులున్నాయని, వినే వాళ్లు అమాయకులైతే హైదరాబాద్ నగరాన్ని కనిపెట్టింది కల్వకుంట్ల కుటుంబం అని చెపుతాడేమో అని ఆయన అన్నారు. కేటీఆర్ ఏ మొహం పెట్టుకొని నగరంలో తిరుగుతున్నాడు…? అని ఆయన ప్రశ్నించారు.…