మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లోని చిలకోయలపాడు లో సీసీ రోడ్ల శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా మాట్లాడినా ఆయన మరోసారి కాంగ్రెస్‌పై, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటైన వాఖ్యలు చేశారు. ‘రేవంత్ వాడు ఎక్కనుంచి వచ్చాడు తెలుగుదేశం నుంచి వచ్చాడు.. రేవంత్ కాంగ్రెస్ ను ఉద్దరిస్తాడ.. కాంగ్రెసోల్లకు ఐక్యత లేదు..అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు.. ఒకరు ముందు పొతే మరొకరు చొక్కాపట్టి కిందకు లాగుతారు. ఇలాంటి వాళ్ళు ఉన్నచోట చంద్రబాబు శిష్యుడు రేవంత్ అయితాడా సీఎం. నేను కాంగ్రెస్ నుండే వచ్చాను. నాకు తెలుసు ఎవరు ఎలాంటి వారో. మళ్ళీ మూడోసారి ముచ్చటగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం’ అని రెడ్యా నాయక్ జోస్యం చెప్పారు.
Also Read : Amit Shah : కాంగ్రెస్ పార్టీకి నాయకులే లేరు.. మా వాళ్లే దిక్కయ్యారు..
‘ఇన్ని రోజుల రాజకీయ చరిత్రలో నేను చేసిన అభివృధి తప్ప మరెవరైనా చేసారా. ఇప్పటివరకు కేసీఆర్ చేసిన పనులకు ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది. రేవంత్ రెడ్డి నీకు దమ్ము దైర్యం ఉంటే నాపై చేసిన ఆరోపణలు, నిందలు నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. పొరపాటున మోసపోకండి మళ్లీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. మాకే ఓటు వేయండి’ అని రెడ్యా నాయక్ వ్యాఖ్యానించారు.
Also Read : Bhatti Vikramarka : కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం జనగణనను వెంటనే మొదలు పెట్టాలి