గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జగనన్న ముఖ్యమంత్రి హయాంలో సుమారు 900 కోట్లు నిధులతో పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రెస్ మీట్ లో తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టారని…. అలాగే వాలంటీర్లు అంతా విధిగా కాకుండా ఒక సమాజ సేవగా భావించి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు వాళ్లకు చేర్చే ప్రధాన పాత్ర వీరిదేనని మా తరపున ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు.
అలాగే ఈ నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాల్లో 91 సచివాలయాలు ఉన్నాయని ఇప్పటివరకు 32 సచివాలయాల్లో వైసీపీ ప్రభుత్వం గడపగడపకు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ప్రజల నుండి మళ్లీ మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కావాలని ఆయన సంక్షేమ పథకాలు మాకు సకాలంలో అందుతున్నాయని ప్రజలు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను మళ్ళీ ఆశీర్వదించి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించేలా మీ మీడియా మిత్రులు సహకారంతో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ అభివృద్ధి గూర్చి వివరించాలన్నారు.
Read Also: Raw Mango: పచ్చి మామిడి తింటున్నారా.. ఈ లాభాలు మీ సొంతం
ప్రపంచమంతా మన వాలంటీర్ వ్యవస్థ ను హర్షిస్తున్నారని తెలిపారు.వాలంటీర్ ల ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిస్కారం చేసేందుకు ఈ వాలంటీర్ లతో ఓటు మాట కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. అలాగే విలేకరుల సమావేశం లో వైసీపీ ప్రభుత్వం అందించే నవరత్నాలు సంక్షేమ పథకాలు గూర్చి వివరణ ఇచ్చారు. మన నియోజకవర్గం లో అత్యధిక గిరిజనులు ఉన్న ప్రాంతమని మాకు ఐటీడీయే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించగా తక్షణమే స్పందించి ఐటీడీయే కేంద్రంను ఏర్పాటయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారాని ఎమ్మెల్యే తెలిపారు.కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉండే ఉద్దానం ప్రాంత ప్రజలకు, అలాగే మన నియోజకవర్గం లో మంచి నీరు అందించేందుకు జగన్ మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నరన్నారు.ఈ పథకం ప్రారంభానికి స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చి ప్రారంభిస్తారని తెలిపారు……
అలాగే వంశధార నిర్వాసితులకు నష్టపరిహారం కొంతమేర అందించామని మరో విడతలో నష్టపరిహారం అందించేందుకు ముఖ్య మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. దీనితో నిర్వాసితులకు 90 శాతం పూర్తిగా నష్టపరిహారం అందుతుందన్నారు.గతంలో ఉండే టీడీపీ ప్రభుత్వం మాటల వరకే హామీ ఇచ్చారు కానీ వాటిని ఎవరూ అమలు చేయలేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమం లో వైసీపీ యువనాయకుడు సవిరిగాన ప్రదీప్, మంచు చంద్రయ్య,కొండాల అర్జునుడు,చిన్నిక్రిష్ణ, డి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Diet Myths and Facts: ఆహారం, ఫిట్ నెస్ విషయంలో అపోహలు- వాస్తవాలు