ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధితో పాటు సమాంతరంగా పట్టణాభివృద్ధి జరగాలని, దానికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలను రూపొందించుకుని అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఆదేశించారు. బుధవారం వేములవాడ టెంపుల్ అతిథి గృహంలో వేములవాడ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ) పరిధిలో మున్సిపల్, టెంపుల్, ఇరిగేషన్, రెవెన్యూ, మిషన్ భగీరథ అధికారులు, టెంపుల్ అధికారులు సమన్వయంతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి పై ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వీటీడీఏ వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి లతో కలిసి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సమీక్ష నిర్వహించారు.
Also Read : Love Today Trailer: లవర్స్ ఒకరి ఫోన్ ఒకరు మార్చుకుంటే..?
సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ.. వీటీడీఏ ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మిని ట్యాంక్‌బండ్ పనులు పూర్తి చేసి చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించాలని అధికారులను కోరారు. రూ.20 కోట్లతో అదనపు భూమి కావాల్సి ఉన్నా ట్యాంక్‌బండ్‌పై నిర్మించిన 800 మీటర్ల రిటైనింగ్‌వాల్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. భక్తుల కోసం స్నానఘట్టాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మూలవాగు నుంచి మెయిన్ టెంపుల్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని మున్సిపల్, ఆర్ అండ్ బీ ప్రతినిధులను ఆదేశించారు. వేములవాడ పట్టణానికి తాగునీటిని సరఫరా చేసేందుకు మిడ్ మానేరు జలాశయం నుంచి ఆలయ ట్యాంకుకు గోదావరి నీటిని తరలిస్తున్నందున అధికారులు శివరాత్రి వరకు వేచి ఉండకుండా ఆలయ ట్యాంక్‌ను గరిష్ట సామర్థ్యంతో నింపాలని ఆదేశించారు.