MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
- ప్రధాని మోడీ పొదుపు పిలుపును ప్రజలు అర్థం చేసుకోవాలి
- పొదుపు వైపు ప్రజలు దృష్టి పెట్టాలి
- రాజకీయ విమర్శల కంటే దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడం అందరి బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పొదుపు పిలుపును ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమండ్రిలో రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో దేశ విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బంగారం దిగుమతులపై భారీగా విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోందని, అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గించి పొదుపు వైపు ప్రజలు దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు.
1967లో ఇందిరాగాంధీ ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ అమలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా బంగారం కొనుగోళ్లు తగ్గించాలని పిలుపునిచ్చారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రధాని మోడీపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. దేశ విదేశీ మారక నిల్వలు బలంగా ఉండటం ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలని సూచించారు. అలాగే ప్రధాని మోడీ తన భద్రతా కాన్వాయ్‌ను కూడా తగ్గించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాన్వాయ్ ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ విమర్శల కంటే దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
తాజావార్తలు
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!