హిందువులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం హిందువులపై దౌర్జన్యం చేస్తుందన్నారు. గత కొన్నేళ్ళుగా హుస్సేన్ సాగర్ లో డ్రైనేజ్ మురికి నీరు కలుస్తుంది దానివల్ల హుస్సేన్ సాగర్ పొల్ల్యూట్ కావడం లేదా..? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్లో వైభవంగా జరుగుతూ వస్తున్నాయని, మహారాష్ట్ర తర్వాత గణేష్ ఉత్సవాలు తెలంగాణలో ఘనంగా జరుగుతాయన్నారు. కొంతమంది కావాలని గణేష్ నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూట్ అవుతుందని కోర్టులో పిటిషన్ వేశారని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది సరైన రీతిలో వాదించలేకపోవడం వల్లే హైకోర్టు పిఓపి వినాయకులను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదని తీర్పు చెప్పింది.. హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ డ్రైనేజ్ ఎంత కలవడం లేదా ఫ్యాక్టరీల వ్యర్ధాలంతా హుస్సేన్ సాగర్ లోకి రావడం లేదా కేసీఆర్ సమాధానం చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా హుస్సేన్ సాగర్ ను మంచినీటి సరస్సుగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటిదాకా ఎందుకు మార్చలేకపోయారు..? రాష్ట్రంలో పొల్యూషన్ బోర్డ్ ఏం చేస్తుంది వినాయకుడిని నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూషన్ అవుతుంది అనే రిపోర్టు మీ దగ్గర ఉంటే జడ్జి ముందర ఎందుకు పెట్టలేదు.. గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు ఇలాంటి తీర్పుని ఇవ్వడం వెనక ప్రభుత్వ వైఫల్యం ఉంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం పిఓపి గణేష్ ల వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూట్ కాదని జీవో ఇచ్చింది.. ఆ జీవోను హైకోర్టు జడ్జి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు. ఎప్పటిలాగే గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే జరుగుతుంది… ఎవరైనా అడ్డుపడితే ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత..’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.