Site icon NTV Telugu

MLA Raja Singh: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

Raja Singh

Raja Singh

MLA Raja Singh: తనను టార్గెట్ చేస్తూ బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.. తాను బీజేపీకి రాజీనామా జరగడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు.. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తనను టార్గెట్ చేస్తారని అడిగారు. తాను బీజేపీ కార్యకర్తల కోసం మాట్లాడానన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 10 నుంచి 12 మందిని సికింద్రబాద్ పార్లమెంట్ నుంచి తీసుకున్నారని చెప్పారు.

READ MORE: Supreme Court: ‘‘ మన రాజ్యాంగం గర్వకారణం’’.. నేపాల్, బంగ్లాలను ఉదహరించిన సుప్రీంకోర్టు..

ఇంతకీ ఇది రామ చందర్ రావు కమిటీ నా? మా కిషన్ రెడ్డి వేసిన కమిటీ నా? అని ప్రశ్నించారు. ఈ కమిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణలో తీసుకువస్తారా అన్నారు. ఒక వేళ తీసుకొస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. పార్టీని సర్వనాశనం చేస్తున్నారని వారు ఫోన్ చేసి చెబుతున్నారు. ఎంపీలు ఈ కమిటీతో సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఆ విషయాన్ని బయటకు చెప్పారన్నారు.

READ MORE: Jagtial: గణపతి చందా ఇవ్వలేదని కులం నుంచి బహిష్కరణ.. ఎవరైనా మాట్లాడితే రూ.25వేలు ఫైన్..!

“రామ చందర్ రావు వెనుక కొందరు ఉండి పార్టీని నడిపించాలని అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాను నడిపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్ మాట్లాడే పద్ధతి సరిగా లేదు. బీబీ నగర్ ఎయిమ్స్ లో పోస్ట్ లు ఇప్పిస్తానని రూ. మూడు లక్షలు తీసుకున్నారని మీపై ఆరోపణలు ఉన్నాయి. భార్యతో కలిసి రామచందర్ రావు ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసుకున్నారట. నేను నాలుగో సారి పోటీ చేయాలా వద్దా? అని ఆలోచిస్తా. నన్ను గెలిపించింది మా బీజేపీ కార్యకర్తలే.. మళ్ళీ కూడా గెలిపిస్తారు. మా పార్టీ బాగు పడాలనేది నేను అనుకుంటున్న. అధికారంలోకి రావాలనే నా కోరిక.. నేను ఎమ్మేల్యే గా రాజీనామా చేయను. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను రాజీనామా చేస్తా.” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

Exit mobile version