MLA Raja Singh: తనను టార్గెట్ చేస్తూ బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.. తాను బీజేపీకి రాజీనామా జరగడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు.. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తనను టార్గెట్ చేస్తారని అడిగారు. తాను బీజేపీ కార్యకర్తల కోసం మాట్లాడానన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 10 నుంచి 12 మందిని సికింద్రబాద్ పార్లమెంట్ నుంచి తీసుకున్నారని చెప్పారు.
Fake Facebook Account in Telangana BJP: తెలంగాణ బీజేపీ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సెంట్రల్ జోన్, సైబర్ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నకిలీ ఖాతాలో అభ్యంతరకరమైన, తప్పుడు కథనాలను పోస్ట్ చేస్తున్నారని.. ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణులలో గందరగోళం, విభేదాలకు కారణమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.