NTV Telugu Site icon

Tatikonda Rajaiah: సొమ్మొకడిది.. సోకొకడిది.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాట్ కామెంట్స్

Rajaiah

Rajaiah

అధికార బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గాల మధ్య రాజకీయ రణరంగం కొనసాగుతుంది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఏర్పడింది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రానున్న ఎన్నికల కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాదని.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. దీంతో తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో మాటల బాణాలు వదులుతున్నారు. నిత్యం ఏదో విధంగా కడియంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

Jasprit Bumrah: టీమిండియాకు భారీ షాక్.. జస్ప్రీత్ బుమ్రా ఔట్!

తాజాగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారిందని విమర్శలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసునని.. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొందని మండిపడ్డారు. ఎక్కడో వుండి ఇక్కడ పనులు చేశామని చెప్పుకోవడం సరైంది కాదన్నారు తాటికొండ రాజయ్య. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి విద్య ద్వారానే ఈ స్థాయికి వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Big Breaking: ఈటల రాజేందర్కు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లోని ముందు వాహనాన్ని ఢీకొన్న కారు

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించారు. కాగా.. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ గా ఉన్న రాజయ్యను కాదని కడియం శ్రీహరికి అవకాశం కల్పించింది బీఆర్ఎస్ అధిష్టానం. దీన్ని రాజయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నవ్య మరోసారి తెరపైకి వచ్చారు. తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని.. ఒక మహిళ ఎమ్మెల్యే అయితే ఆడపడుచులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలు కలుగుతుందని నవ్య చెప్పారు. మాదిగ బిడ్డనైన తనకు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి అవకాశం కల్పించాలని ఆమె కోరారు. కేసీఆర్ ఒక్క ఛాన్స్ ఇస్తే నియోజకవర్గం రూపు రేఖలు మారుస్తానని ఆమె పేర్కొన్నారు.