NTV Telugu Site icon

MLA Raja Singh :శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయి

Mla Raja Singh

Mla Raja Singh

MLA Raja Singh : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. వైఎస్సార్ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా చాలావరకు ముస్లింలకు శ్రీశైలం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో అనేక షాప్ లు ఇచ్చారని, అప్పుడు హిందూ.. ఇతర సంఘాలు కోర్టుకు వెళ్ళారు.. స్టే కూడా తెచ్చుకున్నారన్నారు. నిన్న శివ స్వాములు ముస్లింలకు ఎందుకు షాప్ లు ఇచ్చారని ప్రశ్నిస్తే వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారన్నారు. మహా శివరాత్రికి లక్షల మంది భక్తులు శ్రీశైలం వెళ్తారని, అక్కడ పవిత్రతను దెబ్బ తీసే కుట్ర జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ఏపీ సీఎం.. డిప్యూటీ సీఎంకు నేను విజ్ఞప్తి చేస్తున్న మన హిందూ దేవాలయాల దగ్గర వేరే మతం వాల్ల షాపులు ఉండకుండా చూడాలన్నారు రాజా సింగ్‌.

Bangladesh: అవమానాలు మరిచిపోయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్‌తో తొలిసారిగా వాణిజ్యం..

కోర్టు లు కూడా అదే చెబుతున్నాయని, అక్కడ ఉన్న ఫాల్తూ లీడర్.. ఈవో ముస్లింలకు అండగా ఉంటున్నారన్నారు. పోలీసులు శివ స్వాముల పైన లాఠీ ఛార్జ్ చేస్తే చూస్తూ ఊరుకోమని, నేను ఈవోకు పోలీసులకు సిరియస్ గా చెప్తున్నా.. శివ స్వాముల పైన లాఠీచార్జ్ చేసిన… వారిని ఇబ్బంది పెట్టిన యావత్తు తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ నుంచి శివ భక్తులం శ్రీశైలం చేరుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న వారిని ఎలా పంపాలో మేము చూసుకుంటామని, ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను వేరే మతానికి సంబంధించి ఒక్క షాపు కూడా మన పుణ్య క్షేత్రాల దగ్గర ఉండకుండా చూడాలన్నారు రాజా సింగ్‌.

Alef Aeronautics : ఇక ట్రాఫిక్ జామ్ టెన్షన్ పోయింది.. ఎగిరే కారు వచ్చేసింది… దాని ధర ఎంతంటే ?