NTV Telugu Site icon

Raja singh Counter To KTR: మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్

Ktr Vs Raja

Ktr Vs Raja

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరుగుతూ వుంటుంది. తాజాగా గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి కేటీఆర్ కి కౌంటరేశారు. ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్ గతం మర్చిపోయావా? అసెంబ్లీ సమావేశాలకు రాకుండా మా ముగ్గురు ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు కదా. ఎంపీల సస్పెన్షన్ గురించి ట్వీట్ చేసే అధికారమే నీకు లేదు. ఓటీటీ లో ఏమి చూడాలని అడుగుతున్నావు కదా? కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడు. మోదీ, అటల్ బిహారీ వాజపేయి చరిత్ర చదువు. నాస్తికుడి నుంచి ఆస్తికుడవు అవుతావు అన్నారు రాజా సింగ్.

అంతకుముందు రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్‌ పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎంపీల సస్పెన్షన్ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాల మీద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను రాజ్యసభ నుంచి 10 రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చర్చకు ఎందుకు భయపడుతున్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఎందుకు’ అని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.

జీఎస్టీ, అధిక ధరలు, ద్రవ్యోల్బణంపై రాజ్యసభలో నిరసన తెలిపిన 19 మంది విపక్ష సభ్యులను డిప్యూటీ చైర్మన్‌ వారం రోజులపాటు సస్పెండ్‌ చేశారు. వీరిలో టీఆర్‌ఎస్‌కు చెందిన బడుగుల లింగయ్య యాదవ్‌, దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. మిగిలిన 16 మందిలో ఏడుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు, ఆరుగురు డీఎంకే ఎంపీలు, ఇద్దరు సీపీఎం ఎంపీలు, ఒక సీపీఐ ఎంపీ ఉన్నారు. బుధవారం పార్లమెంట్ గాంధీ విగ్రహం ముందు రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.

Rowdy Sheeter Remand: బాలికపై అత్యాచార యత్నం.. రౌడీషీటర్ కి రిమాండ్