Site icon NTV Telugu

Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌.. జైలుకు తరలింపు..

Padi Kaushik 1

Padi Kaushik 1

క్వారీ యజమాని మనోజ్ రెడ్డిపై బెదిరింపు కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట లోని రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్ట భద్రత నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం తరలించనున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పీఎస్ దగ్గర హైడ్రామా కొనసాగతోంది.

READ MORE: IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే..?

పాడి కౌశిక్‌రెడ్డి క్వారీ యజమాని భయభ్రాంతులకు గురి చేశారని.. అతడికి రిమాండ్ విధించాలంటూ పీపీ వాదించారు.
క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్ఎస్ లీగల్ టీం వాధించింది. మొదట ఎఫ్ఐఆర్‌లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ లాయర్ వాదించారు. 308 సెక్షన్ 4ని తర్వాత మార్చి ఫైవ్ చేయడంతో నాన్ బెయిలబుల్‌ కేసుగా మార్చారని లీగల్ టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌశిక్ రెడ్డికి రిమాండ్ విధించవద్దని.. లీగల్ టీం వాధించింది. ఇరు వాదనలు విన్న కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

https://www.youtube.com/watch?v=dghH0ibKFiw

 

Exit mobile version