క్వారీ యజమాని మనోజ్ రెడ్డి బెదిరింపు కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట లోని రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్ట భద్రత నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం తరలించనున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పిఎస్ దగ్గర హైడ్రామా కొనసాగతోంది.