బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే నవ్వస్తుంది.. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నష్టపరిచింది అన్నారు. కబ్జాలకు, మోసాలకు బీఆర్ఎస్ నాయకులు కేరాఫ్ అడ్రస్ గా మారారని ఆరోపించారు. జిల్లా మీద పడి బీఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లా తిన్నారు.. బీఆర్ఎస్ కు వరంగల్ గురించి మాట్లాడే అర్హత లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులకు ఓటు అడిగే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడటానికి మీకు సిగ్గు ఉండాలి.. కాంగ్రెస్ తోనే వరంగల్ అభివృద్ధి జరుగుతుంది అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.
Read Also: Kajal Aggarwal : ఆ సమయంలో అతడు చేసిన పనికి షాక్ అయ్యాను..
ఇక, ఎంజీఎం దవాఖానాలో జరిగిన ఘటనను పెద్ద భూతద్దంలా చూపిస్తున్నారు అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కరెంటు పోవడం ప్రకృతి వలన జరిగిన ఘటన.. పూర్తి విచారణ జరుగుతుంది.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎంజీఎం హస్పటల్ బాగుపడింది.. గతంలో కాంగ్రెస్ ఎంజీఎం సమస్యలపై ధర్నా చేసిన మీరు పట్టించుకోలేదు.. పట్టించుకోని మీరు ఎంజీఎం గురించి మాట్లాడటానికి సిగ్గు పడాలి.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంజీఎంలో ఎలాంటి పరిణామాలు జరిగాయో తెలియదా? అని ప్రశ్నించారు. పేషెంటును ఎలుకలు కోరికిన ఘటన, మిషనరీ పాడైన ఘటనలు గుర్తు లేవా? అంటూ మండిపడ్డారు. 10 ఏళ్ల వ్యత్యాసం.. ఆరు నెలల వ్యత్యాసమును ప్రజలు గమనించాలి.. వరంగల్ కు కేటీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు.. వరదలు వచ్చినప్పుడు ఇంటింటికి పది వేలు ఇస్తానన్నారు.. ఇచ్చారా అని ఎమ్మెల్యే రాజేందర్ అడిగారు.