సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు స్టడీ మెటిరియల్, పరీక్ష సామాగ్రిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. విద్యార్థులకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ సతీష్ మోటివేషనల్ క్లాసులు బోధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఈవో నాంపల్లి రాజేశ్.. యంఈఓలు.. విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Also Read : Police Station: పోలీస్ స్టేషన్ ఆవరణలోనే విగతజీవిగా పోలీసు అధికారి.. అసలేం జరిగింది?
ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులు భాగా విద్యనభ్యసించి ఉత్తమమైన ఫలితాలు సాధించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ సర్కార్.. ప్రభుత్వ పాఠశాలలకు అధికా ప్రాధాన్యత ఇస్తుందని ఆయన గుర్తు చేశారు. ఉన్నత విద్యనభ్యసించి భవిష్యత్ లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో విద్యాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 2,500 మంది విద్యార్థులకు స్టడీ మెటిరీయల్, పరీక్ష సామాగ్రిని అందించారు.
Also Read : CM KCR : ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్