NTV Telugu Site icon

MLA Grandhi Srinivas: పవన్‌ కల్యాణ్‌కు ఎమ్మెల్యే గ్రంథి కౌంటర్.. మళ్లీ సినిమా షూటింగ్‌కి పంపించే సమయం దగ్గరల్లోనే..!

Mla Grandhi Srinivas

Mla Grandhi Srinivas

MLA Grandhi Srinivas: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భీమవరం పర్యటన, ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌.. ప్రజలు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ను సినిమా షూటింగ్‌లకు పంపించే సమయం ఎంతో కాలం లేదన్నారు. కులాల‌ మధ్య గోడవలు సృష్టించేందుకు పవన్ బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. పవన్ పిరికివాడు.. ఆయన ఎంత పిరికివాడో నేడు ఆయన మాటల్లోనే అర్థమైందన్నారు. మేం సిద్ధం అంటుంటే.. ఆయన యుద్ధం అంటున్నాడు.. ఇది ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. 2019 ఎన్నికల తర్వాత భీమవరం 3వ సారి వచ్చాడు.. ఆయన ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారు..? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలకే ముఖం చూపించలేదు.. వారే పవన్ కల్యాణ్‌.. ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారో చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్‌కు వెన్నెముక లేకే.. టీడీపీ, బీజేపీతో కలసి వస్తున్నాడు అని సెటైర్లు వేశారు ఎమ్మల్యే గ్రంథి.. లా అండ్‌ ఆర్డర్ సమస్యలు సృష్టించిందే పవన్‌ కల్యాణ్‌ అని ఆరోపించిన ఆయన.. పవన్ భీమవరం పర్యటన.. భీమవరం నియోజకవర్గ ప్రజలే కాకుండా.. తెలుగుదేశం నాయకులు కూడా కళ్లు తెరిపించేలా ఉందన్నారు. సినిమాల్లో యాక్టింగ్ చేసే వాళ్లు నిజ జీవితంలో కూడా యాక్టింగ్ చేస్తున్నారని పవన్ కల్యాణ్‌ వ్యవహార శైలిని బట్టి అర్థమైందన్నారు. ఇక, భీమవరం ప్రజలు మళ్లీ సినిమా షూటింగ్ పంపించే సమయం ఎంతో కాలం లేదన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేక ఢిల్లీ వెళ్లి గడ్డం పట్టుకుని తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుంటున్నాడు పవన్‌ కల్యాణ్‌ అంటూ దుయ్యబట్టారు గ్రంథి.. రాజకీయాల్లో రిటైర్మెంట్ కావాలని పవన్ అంటున్నాడు.. చంద్రబాబు నాయుడు 18 సంవత్సరాల కుర్రోడు లా కనబడుతున్నాడా..? ఆయనకు రిటైర్మెంట్ లేదా? అని ప్రశ్నించారు. ఇక, కుప్పం సభలో భువనేశ్వరి మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి కుప్పం నుంచి పోటీ చేశారు కదా చంద్రబాబు కు రెస్ట్ ఇచ్చి నేను పోటీ చేస్తాను అని అంటున్నారు.. చంద్రబాబు చాలామందికి వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు, పవన్, మోడీ, భువనేశ్వరి అందరూ కలిసి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌.