MLA Grandhi Srinivas: పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే గ్రంథి కౌంటర్.. మళ్లీ సినిమా షూటింగ్‌కి పంపించే సమయం దగ్గరల్లోనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Grandhi Srinivas: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన, ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్.. ప్రజలు మళ్లీ పవన్ కల్యాణ్‌ను సినిమా షూటింగ్‌లకు పంపించే సమయం ఎంతో కాలం లేదన్నారు. కులాల మధ్య గోడవలు సృష్టించేందుకు పవన్ బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. పవన్ పిరికివాడు.. ఆయన ఎంత పిరికివాడో నేడు ఆయన మాటల్లోనే అర్థమైందన్నారు. మేం సిద్ధం అంటుంటే.. ఆయన యుద్ధం అంటున్నాడు.. ఇది ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. 2019 ఎన్నికల తర్వాత భీమవరం 3వ సారి వచ్చాడు.. ఆయన ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారు..? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలకే ముఖం చూపించలేదు.. వారే పవన్ కల్యాణ్.. ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారో చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్‌కు వెన్నెముక లేకే.. టీడీపీ, బీజేపీతో కలసి వస్తున్నాడు అని సెటైర్లు వేశారు ఎమ్మల్యే గ్రంథి.. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించిందే పవన్ కల్యాణ్ అని ఆరోపించిన ఆయన.. పవన్ భీమవరం పర్యటన.. భీమవరం నియోజకవర్గ ప్రజలే కాకుండా.. తెలుగుదేశం నాయకులు కూడా కళ్లు తెరిపించేలా ఉందన్నారు. సినిమాల్లో యాక్టింగ్ చేసే వాళ్లు నిజ జీవితంలో కూడా యాక్టింగ్ చేస్తున్నారని పవన్ కల్యాణ్ వ్యవహార శైలిని బట్టి అర్థమైందన్నారు. ఇక, భీమవరం ప్రజలు మళ్లీ సినిమా షూటింగ్ పంపించే సమయం ఎంతో కాలం లేదన్నారు.
Also Read
- Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
- Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనలేక ఢిల్లీ వెళ్లి గడ్డం పట్టుకుని తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుంటున్నాడు పవన్ కల్యాణ్ అంటూ దుయ్యబట్టారు గ్రంథి.. రాజకీయాల్లో రిటైర్మెంట్ కావాలని పవన్ అంటున్నాడు.. చంద్రబాబు నాయుడు 18 సంవత్సరాల కుర్రోడు లా కనబడుతున్నాడా..? ఆయనకు రిటైర్మెంట్ లేదా? అని ప్రశ్నించారు. ఇక, కుప్పం సభలో భువనేశ్వరి మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి కుప్పం నుంచి పోటీ చేశారు కదా చంద్రబాబు కు రెస్ట్ ఇచ్చి నేను పోటీ చేస్తాను అని అంటున్నారు.. చంద్రబాబు చాలామందికి వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు, పవన్, మోడీ, భువనేశ్వరి అందరూ కలిసి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్.
తాజావార్తలు
-
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!