Etela Rajender: రేపు గజ్వేల్ కు ఈటల రాజేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రేపు గజ్వేల్ కు రానున్నారు. గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మొదటిసారి నియోజకవర్గానికి రానున్నారు. దీంతో ఆయనకి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటి మామిడి నుంచి గజ్వేల్ కోట మైసమ్మ ఆలయం వరకు బీజేపీ నిర్వహించే ర్యాలీలో ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. ముట్రాజ్ పల్లిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే, ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలోకి గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ అసంతృప్త నాయకులు చేరనున్నారు.
Read Also: Israel Warned Hamas: మా వాళ్లను వదిలిపెట్టండి.. హమాస్ కు వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
అయితే, తెలంగాణ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ను ఓడించటమే లక్ష్యంగా తాను పోటీ చేస్తానని బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఇక, గజ్వేల్ బరిలో తాను ఉంటే కేసీఆర్ కు టెన్షన్ పక్కా అని చెప్తున్న ఈటల ఆలోచనలకు తగ్గట్టుగానే బీజేపీ అధిష్టానం ఆయనను హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేసే విధంగా టికెట్ కేటాయించింది. ఇక, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ని తాను ఓడించడం ఖాయమని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని పరిస్థితులను బాగానే అధ్యయనం చేశానని ఆయన తెలిపారు.
Read Also: Anasuya: అనసూయ జిమ్ వర్కవుట్స్ వీడియో చూశారా?.. వామ్మో మాములుగా లేదుగా..
కాగా, తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించాలని కేసీఆర్ ఈసారి ఎన్నికలలో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపధ్యంలో ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్- గజ్వేల్ నుండి పోటీ చేస్తున్నారు. అయితే, గజ్వేల్ లో గెలిస్తే కేసీఆర్ ను ఓడించిన పేరు ఈటెలకు దక్కుతుంది. అలా కాకుండా ఓటమి పాలైనా తనకు జరిగే నష్టం ఏమీ లేదు. ఎలాగు హుజూరాబాద్ లో కూడా పోటీ చేస్తున్నారు.. కాబట్టి అక్కడ కచ్చితంగా గెలిచి తీరుతానని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!