జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలు వ్యవహారం రోజు రోజుకు మరింత ముదురుతోంది. నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ వ్యవహారం మరోక మలుపు తిరిగింది. NTR ఫ్యాన్స్ మెంబర్ ధనుంజయ నాయుడికి ఎమ్మెల్యే నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట.
Also Read : NTRNeel : డ్రాగన్ సెట్స్ లో అడగుపెట్టబోతున్న ‘యంగ్ టైగర్’.. ఎప్పుడంటే?
ఈ విషయమై ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఫోన్ మాట్లాడిన TNSF అధ్యక్షుడు, NTR ఫ్యాన్స్ మెంబర్ ధనుంజయ నాయుడు ఎన్టీవీతో మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వర్గీయులు నా ఫ్యామిలీని బెదిరిస్తున్నారు. ఎన్టీఆర్ పై ఆయన మాట్లాడిన ఆడియో కాల్ ఫేక్ అని నేను ప్రెస్ మీట్ పెట్టీ చెప్పాలని నా భార్య, అన్న కి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటితో నాకు ప్రాణహాని ఉంది. నేను పార్టీ కోసం పనిచేసి జైలుకి వెళ్ళినవాడిని. 24 కేసులు నాపై గత ప్రభుత్వం పెట్టింది. NTR తల్లి పట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆయన అనంతపురంలో బహిరంగ క్షమాపణ చెప్పాలి. NTR తల్లి అనే కాదు ఎవరి తల్లినైనా ఇలా మాట్లాడటం సరికాదు. పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ఆడియో కాల్ గురించి, నా ఫ్యామిలీ ను బెదిరిస్తున్న విషయాన్ని కూడా పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశాను. అధిష్టానం నన్ను పిలిపిస్తే వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కార్యాచరణ సిద్ధం చేస్తాం. ఎమ్మెల్యే నుండి రక్షణ కావాలి’ అని తెలిపాడు.