యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రశాంత్ నీల్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ముగించారు.
Also Read : AA22xA6 : అల్లు అర్జున్ సినిమాలో మరొక స్టార్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ అట్లీ
ఇటీవల వార్ 2 రిలీజ్ కారణంగా ఈ సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ సినిమా రిలీజ్ హంగామా దాదాపు ముగిసింది. ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం చేస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో తిరిగి పాల్గొనబోతున్నాడు.సెప్టెంబర్ మొదటి వారం నుండి హైదరాబాద్‌లో జరిగే డ్రాగన్ సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారు. నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారట. హైదరాబాద్ లో వేసిన హౌస్ సెట్ కోసం దాదాపు రూ. 15 కోట్లు ఖర్చు చేశారట. అవుట్ అండ్ అండ్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ మాస్ స్టామినా ఏంటో మరోసారి చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇదివరకు ఎప్పుడు చూడని ఎన్టీఆర్ ను డిఫ్రెంట్ లుక్ లో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్.