ఏపీ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపైఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. అయితే.. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు ప్రమాణం చేయాలని నారా లోకేష్‌కు అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. తాను కూడా ప్రమాణం చేస్తానని.. ఈ రోజు ఉదయం నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. లోకేష్ ఆరోపించినట్లు తనకు ఆస్తులు లేవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని అన్నారని, నేను చేశానన్నారు. నాకు వెయ్యి కోట్లు ఆస్తులు ఉన్నాయని పత్రాలు విడుదల చేశారని, లేని ఆస్తులను నాకు అంటగట్టారన్నారు.
Also Read : Malla Reddy: మంత్రి మల్లారెడ్డి కళాశాల అధికారులకు ఈడీ నోటీసులు
వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఇచ్చానని, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు అమ్ముకున్నానని తెలిపారు. ఇస్కాన్ సిటీలో నాకు 8 ఎకరాల భూమి ఉండేది ఇప్పుడు నాలుగు ఎకరాల భూమి మాత్రమే ఉందని, నాకు ఏ రాష్ట్రంలో వ్యాపారాలు లేవు… ఇతర జిల్లాల్లో కూడా లేవన్నారు. నా నిజాయితీ నిరూపించుకునే అవకాశం లభించిందని, నాకు వెయ్యి కోట్లు ఉందని ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం చూసి ఐటి శాఖ అధికారులు కూడా విచారణ చేస్తారేమోనని, వాళ్లు విచారణ చేసే క్లీన్ చిట్ ఇస్తే సంతోషమేనన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరిని శిక్షిస్తారో వచ్చే ఎన్నికల్లో చూద్దామని ఆయన అన్నారు.
Also Read : Rare Brain Infection: కేరళలో అత్యంత అరుదైన అమీబా ఇన్ఫెక్షన్ కేసు.. మెదడును ప్రభావితం చేసే వ్యాధి..