CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: మియాపూర్‌లోని రూ. 50 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇవ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలపై, నాటి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్, ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్‌లు కలిసి ఈ మియాపూర్ భూములను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారని, ఇందుకోసం దామోదర్ రావుకు విలాసవంతమైన కార్లు లంచంగా ఇవ్వడంతో పాటు కేసీఆర్‌కు నగదు రూపంలో ముడుపులు ముట్టాయని సీఎం ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా ఈ భూకబ్జాలపై నిరంతరం పోరాడినందుకే తనపై కక్షగట్టి జైలుకు పంపారని గుర్తుచేశారు. ఈ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడంతోనే అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఆ భూముల రక్షణకు సరైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రూ. 1.50 లక్షల కోట్ల విలువైన భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడి రక్షించామని వెల్లడించారు.
ఈ క్రమంలో కేటీఆర్ భలేరావు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై ఐఎంజీ భూములను కొట్టేయాలని చూస్తే న్యాయపోరాటంతో అడ్డుకున్నామని, కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి భూములను బీఆర్ఎస్ నాయకులు కొట్టేసేందుకు చూస్తే గెలిచామని సీఎం చెప్పారు. గుర్రంగూడ అటవీ భూములను కేటీఆర్ అనుచరులు కబ్జా చేయడానికి యత్నించగా సుప్రీంకోర్టులో పోరాడి అది అటవీ భూమేనని తేల్చామని తెలిపారు. మంచిరేవులలో 143 ఎకరాల భూమిని కేటీఆర్ రాయలసీమ బిల్డర్స్‌తో కలిసి ఆక్రమించేందుకు చూస్తే దానిని రక్షించి, అక్కడ పోలీసుల పిల్లల కోసం స్కూల్ నిర్మించామని వివరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు నజరానాగా ఇచ్చిన 400 ఎకరాల అటవీ భూమిని సుప్రీంకోర్టులో పోరాడి దక్కించుకున్నామని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ బీఆర్ఎస్ నాయకుల భూఆక్రమణలను అడ్డుకున్నామని పేర్కొన్నారు. హరీష్ రావు మామ హనుమంత రావు ఆక్రమించుకున్న భూములను సర్వే చేయకుండా అధికారులను అడ్డుకుని, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూములపై కేసులు వేసిన కేసీఆర్, హరీష్ రావు అధికారంలోకి వచ్చాక ఆ కేసుల్లో లాలూచీపడి ఆ భూములను స్వాధీనం చేసుకోలేదని ఆరోపించారు.
Also Read
- Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
- Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- World Bank Report: పేదరిక నిర్మూలనలో భారత్ రికార్డు.. 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి విముక్తి.. కానీ..
- Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
మియాపూర్ సహా రక్షించిన భూముల అమ్మకం, నిధుల సమీకరణపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని, ఈ విక్రయాల ద్వారా వచ్చే నిధులను నీటిపారుదల, విద్యా, వైద్య రంగాలు, ముఖ్యంగా విద్యాభివృద్ధికి కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై క్యాబినెట్లో చర్చిస్తామన్నారు. చారిత్రక తీర్పు వస్తే బీఆర్ఎస్ నేతలు కనీసం స్పందించకపోగా, రెవెన్యూ అధికారులను అభినందించకపోవడం వారి నైజానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో భూములపై చర్చ పెడితే తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారన్న సీఎం, తమ ఆక్రమణలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ధైర్యంగా అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ రెండు గ్రామాల మధ్య వివాదాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారని, అక్కడ ఉన్న ఆక్రమణలను తేల్చి శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తామని ప్రకటించారు. కోర్టు తీర్పులైనా చూసి కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని భూఆక్రమణలు చేయడం మానుకోవాలని, మియాపూర్ భూములపై కుట్రలు స్వస్తి పలకాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!