Crime News: ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను చంపిన భర్త! కనిపించట్లేదని డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband kills his wife in Miyapur: 18 ఏళ్లుగా కలిసి జీవించిన భార్యను భర్త అతి కిరాతకంగా చంపాడు. ఆపై భార్య కనిపించట్లేదని డ్రామాలాడాడు. చివరకు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో చోటుచేసుకుంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న మియాపూర్ పోలీసులు.. భర్తను రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్, ఎస్సై గిరీష్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన రాజేశ్వరి (38)కి అదే జిల్లా రుద్రురు మండల కేంద్రానికి చెందిన కార్పెంటర్ రాజేష్‌తో 2005లో వివాహమైంది. రాజేష్ బతుకుదెరువుకు హైదరాబాద్ వచ్చి.. మియాపూర్‌లో ఉంటున్నాడు. రాజేష్, రాజేశ్వరిలకు ఇద్దరు కుమారులు. పిల్లలు బోధన్‌లో రాజేశ్వరి తల్లి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. 18 ఏళ్ల వైవాహిక జీవితం సాఫీగానే సాగినా.. భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా రాజేశ్వరి అడ్డు తొలగించుకోవాలని డిసెంబర్ 10న గండిమైసమ్మ ప్రాంతంలో ఓ ఫంక్షన్ ఉందని రాజేష్ బైకుపై తీసుకెళ్లాడు.
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
- Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
Also Read: Crime News: వారం రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. గుర్తించలేని స్థితిలో తల్లి, సోదరుడు!
బౌరంపేట సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్ ప్రాంతానికి రాజేశ్వరిని తీసుకెళ్లి.. తలపై రాయితో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడేసి.. మియాపూర్‌లోని ఇంటికి వచ్చాడు. 12న రాజేశ్వరి తల్లి, సోదరికి ఫోన్ చేసి.. తన భార్య కనిపించడం లేదని రాజేష్ నాటకం మొదలుపెట్టాడు. కంగారుపడిపోయిన రాజేశ్వరి తల్లి.. డిసెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో.. అసలు విషయం వెలుగు చూసింది. రాజేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. రాజేష్‌ను రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
-
Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?
-
Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!
-
Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..
-
CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ