Mitchell Starc Fastest Five-Wicket Haul in Test Cricket: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్ట్ (డే-నైట్ టెస్ట్) మ్యాచ్‌లో 15 బంతుల్లోనే 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. స్టార్క్ తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో 7.3 ఓవర్లు వేసిన స్టార్క్.. 9 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఇదే టెస్టులో ఈ ఆసీస్ స్పీడ్ గన్ 400 టెస్ట్ వికెట్లను కూడా అధిగమించాడు. 1947లో ఆస్ట్రేలియా బౌలర్ ఎర్నీ తోషాక్ 19 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టాడు.
సబీనా పార్క్‌లో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే మిచెల్ స్టార్క్ వికెట్ పడగొట్టాడు. అదే ఓవర్లోని చివరి రెండు బంతులకు వికెట్లు పడగొట్టాడు. తన రెండో ఓవర్‌ను మెయిడిన్ వేశాడు. మూడో ఓవర్‌లోని మొదటి, మూడో బంతికి వికెట్స్ తీశాడు. దాంతో స్టార్క్ ఖాతాలో ఫైఫర్ చేరింది. రెండుసార్లు హ్యాట్రిక్ మిస్ అయింది. ఎనిమిదవ ఓవర్‌లో మరో వికెట్ తీసి.. ఆరు వికెట్స్ ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్టార్క్.. అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు.
Also Read: Banakacherla Project: ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ!
పింక్ బాల్‌తో మిచెల్ స్టార్క్ రెచ్చిపోతున్నాడు. ఇపటివరకు 14 టెస్ట్‌లు ఆడిన స్టార్క్.. 17.08 సగటుతో 81 వికెట్లు తీశాడు. డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లలో ఐదు 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. 35 ఏళ్ల స్టార్క్ ఇపటివరకు 100వ టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 402 వికెట్స్ పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 6/9. ఐదు వికెట్ల ప్రదర్శన 16 సార్లు చేశాడు.