NTV Telugu Site icon

Mulugu District: కానిస్టేబుల్ వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిన యువకుడి దారుణ హత్య..

Murder

Murder

యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన చిడేమ్ సాయి అనే యువకుడు ఈ నెల 15వ తేదీన రాత్రి 7 గంటలకు మిస్సింగ్ అయినట్లు 16న స్టేషన్‌లో కేసు నమోదైంది. అదృశ్యమైన ప్రాంతం హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో సాయి కుటుంబ సభ్యులు 18వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సంచలన విషయం వెల్లడైంది. గతంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ వివాహేతర బంధాన్ని సాయి బయటపెట్టినట్లు తేలింది. నేరం రుజువు కావడంతో కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

READ MORE: Off The Record: విజయ సాయిరెడ్డి వైసీపీ ముద్ర తొలగించుకోవాలనుకుంటున్నారా..?

దీంతో ఎలాగైనా సాయిని చంపేయాలని శ్రీనివాస్ పగతో రగిలిపోయాడు. కొన్ని నెలలుగా సాయిని చంపడానికి రెక్కీ నిర్వహించాడు. తన వల్ల కాకపోవడంతో సుపారీ గ్యాంగ్ తో సాయిని హత్య చేసేందుకు స్కెచ్ వేశాడు. అనుకున్నట్టుగానే సుపారీ గ్యాంగ్ చేతికి సాయి చిక్కాడు. హనుమకొండ నయీంనగర్ ప్రాంతంలో సాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మారమధ్యంలో అతన్ని సుపారీ గ్యాంగ్ చంపేసింది. హుజూరాబాద్ మండల పరిధిలోని హుస్నాబాద్ ప్రాంతంలో ఓ బావిలో సాయి మృతదేహాన్ని పారేశారు. ఈ కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు హత్యకు గురైన సాయి సెల్ ఫోనును ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లే ట్రైన్‌లో పారేశాడు.

READ MORE: Shine Tom Chacko : షైన్ టామ్ చాకోకు భారీ ఊరట..

సాయి మొబైల్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లులో చూపించడంతో సతమతమైన పోలీసులు ఈ ఘటనను విచారించారు. విచారణలో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణ కొనసాగుతుండగా సాయి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై ఉదయం నుంచి రాత్రి వరకు హన్మకొండ సబ్ డివిజన్ ఏసీపీ దేవేందర్ రెడ్డి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టి కేసును ఛేదించారు. ప్రస్తుతం సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్‌కు తరలించారు.