Site icon NTV Telugu

Chirag Paswan: చిరాగ్ పాశ్వాన్కు తప్పిన ముప్పు.. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం

Chirag

Chirag

బీహార్‌లోని ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎల్‌జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో చిరాగ్ పాశ్వాన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్‌లో ఎన్నికల సభలో ప్రసంగించేందుకు వెళ్లిన చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్‌పై నుంచి కిందకు దిగడంతో చక్రాలు భూమిలోకి వెళ్లాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అయితే.. ఈ ఘటన జరిగిన అనంతరం చిరాగ్ పాశ్వాన్ బహిరంగ సభలో ప్రసంగించారు. అంతకుముందు అమిత్ షా హెలికాప్టర్ కూడా బెగుసరాయ్‌లో ప్రమాదానికి గురికాకుండా తృటిలో తప్పించుకోవడం గమనార్హం.

Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలకు ఇస్తాం..

కాగా.. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం హెలిప్యాడ్ ను ఇటుకలతో తయారు చేశారు. అంతేకాకుండా.. దాని చుట్టూ బురద ఉంది. ల్యాండింగ్ కోసం వచ్చిన హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే.. ఒక చక్రం మట్టిలోకి దూరింది. అయితే పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటనను చిరాగ్ పాశ్వాన్ కార్యాలయం విడుదల చేసింది. ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్‌డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి నిత్యానంద్‌రాయ్‌ ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. ఆయనకు అనుకూలంగా మొహద్దీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళ్లారు.

Mondithoka Jaganmohan Rao: ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మొండితోక జగన్మోహన్ రావు..

Exit mobile version