Miss Universe India 2024: ఎవరీ రియా సింఘా.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- మిస్ యూనివర్స్ ఇండియాగా రియా
- మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం
- 16 ఏళ్ల వయసులో మోడలింగ్ కెరీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meet Miss Universe India 2024 Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2024 కిరీటాన్ని రియా సింఘా సొంతం చేసుకున్నారు. జైపుర్ వేదికగా జరిగిన పోటీల్లో 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం దక్కించుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఊర్వశీ రౌతేలా.. ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక ప్రతిష్టాత్మక ‘మిస్ యూనివర్స్’ 2024 పోటీలో భారతదేశం తరపున రియా పాల్గొననున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఈ రియా సింఘా ఎవరా? అని అందరూ వెతుకున్నారు.
19 ఏళ్ల రియా సింఘా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఈస్టోర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ అండ్ వ్యవస్థాపకుడు బ్రిజేష్ సింఘా, రీటా సింఘా దంపతుల కుమార్తె రియా. జీఎల్‌ఎస్ యూనివర్సిటీ గుజరాత్‌లో రీటా చదువుతున్నారు. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తున్నారు. రియా తన మోడలింగ్ కెరీర్‌ను 16 సంవత్సరాల వయస్సులో 2020లో ప్రారంభించారు. ఆ ఏడాది ‘దివాస్ మిస్ టీన్ గుజరాత్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
Also Read
2023 ఫిబ్రవరి 28న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2023లో రియా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 25 మంది అభ్యర్థులతో పోటీపడి టాప్ 6లో నిలిచారు. 2023 ఏప్రిల్ 19న ముంబైలో జరిగిన జాయ్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 14లో రియా సింఘా పాల్గొన్నారు. 19 మందితో పోటీపడి రన్నరప్‌గా నిలిచారు. 2024 సెప్టెంబర్ 22న మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ 2024 పోటీలో రియా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. రియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 43 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరగనుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?