Miss Universe India 2024: గుజరాత్ యువతిదే ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటం.. ఇక మిస్ యూనివర్స్ టైటిల్ టార్గెట్!
- మిస్ యూనివర్స్ ఇండియాగా రియా
- టైటిల్ కోసం 51 మంది పోటీ
- మిస్ యూనివర్స్ పోటీకి రియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rhea Singha Wins Miss Universe India 2024 Title: ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2024 టైటిల్‌ను గుజరాత్ యువతి రియా సింఘా గెలుచుకున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలేలో 51 మంది టైటిల్ కోసం పోటీ పడగా.. 19 ఏళ్ల రియా విజేతగా నిలిచారు. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా కిరీటాన్ని బహుకరించారు. రియా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.
మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం రియా సింఘా ఆనందం వ్యక్తం చేశారు. ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డా. నేను ఈ కిరీటానికి అర్హురాలిని అని భావిస్తున్నా. గత విజేతలే నాకు స్ఫూర్తి’ అని రియా చెప్పారు. రియా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నివాసి. రీటా సింఘా, బ్రిజేష్ సింఘా దంపతుల కుమార్తె ఆమె. రియా టాప్ మోడల్. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 40 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రియా ఇన్‌స్టాలో బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తుంటారు.
Also Read
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
- Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పదేళ్ల క్రితం మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియాగా నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024కు ఊర్వశి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. రియా సింఘా విజేతగా గెలిచిన అనంతరం ఊర్వశి తన చేతులతో కిరీటాన్ని బహుకరించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం మళ్లీ భారత్‌కు వస్తుందని ఊర్వశి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో ప్రాంజల్ ప్రియ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ఛవీ వర్గ్, సుస్మితా రాయ్, రూప్‌ఫుజానో విసో తరువాతి స్థానాల్లో నిలిచారు.
తాజావార్తలు
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
-
Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!