Miss Shetty Mr Polishetty :ఓటీటీ లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతి రత్నాలు సినిమాతో ఊహించని ఫేమ్ అందుకున్న నవీన్ పోలిశెట్టి హీరో గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.మహేశ్ బాబు పచ్చిగొళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు గోపీ సుందర్ మరియు రధన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 7న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా షారుఖ్ జవాన్ తో పోటీపడి మరి వసూళ్లు సాధించింది. చిన్న సినిమా గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఓటీటీ ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ గురువారం (అక్టోబరు 05) అర్ధరాత్రి 12 గంటల నుంచి నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుుబాటు లో ఉంచారు. అయితే ఈ మూవీ శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది.ఈ చిత్రం లో మురళీ శర్మ, అభినవ్ గోమటం, నాజర్, సోనియా దీప్తి, జయసుధ మరియు తులసి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. స్టాండ్ అప్ కమెడియన్ గా నవీన్ నవ్వులు పూయించాడు.40 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోని చెఫ్ క్యారెక్టర్‌లో అనుష్క నటించారు. పెళ్లి కాకుండా తల్లిని కావాలనుకు నే ఈ భామకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది ఈ సినిమా కథ..ఈ సినిమా తో అనుష్క చాలా గ్యాప్ తరువాత తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది.
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
తాజావార్తలు
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!