Miss Shetty Mr Polishetty: వేచి ఉండండి అంటూ.. క్షమాపణలు చెప్పిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen Polishetty and Anushka Shetty’s Miss Shetty Mr Polishetty Movie Release Date Postponed: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‍లో రూపొందుతున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 4న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా వాయిదా పడనుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చివరకు అదే నిజమైంది.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విడుదల పోస్ట్ ఫోన్ అయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు యువీ క్రియేషన్స్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఈ ఊహించని ఆలస్యానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. త్వరలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హాస్య విందును మీకు అందిస్తాము. కొత్త విడుదల తేదీ మరియు ట్రైలర్ కోసం వేచి ఉండండి’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
Also Read: Maruti Baleno Price 2023: రూ 1.5 లక్షలు చెల్లించి.. మారుతి బాలెనోను ఇంటికి తీసుకెళ్లండి!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో స్టాండప్ కమెడియన్‌గా నవీన్ పోలిశెట్టి, చెఫ్‌గా అనుష్క శెట్టి నటిస్తున్నారు. ‘జాతి రత్నాలు’ లాంటి భారీ హిట్ నవీన్ అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తుండడం కూడా సినిమాపై హైప్ నెలకొంది. యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నవీన్ కామెడీ, డైలాగ్స్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ వాయిదా అంటూ చిత్ర యూనిట్ బాంబ్ పేల్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన లిరికల్ సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.
Also Read: Umpire Nitin Menon: బెయిర్‌స్టో తప్పిదం.. పసిగట్టిన థర్డ్ అంపైర్! వీడియో వైరల్
We apologize from the bottom of our hearts for this unforeseen delays.
We will soon be serving #MissShettyMrPolishetty, a comedic feast, with a side of laughter…
Stay tuned for the New release date and trailer… pic.twitter.com/LpMbdrVTsm
— UV Creations (@UV_Creations) July 29, 2023
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?