అనుష్క శెట్టి..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందిన అనుష్క ఆ తరువాత మాధవన్ తో నిశ్శబ్దం అనే సినిమా లో నటించింది కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో సినిమాల కు అనుష్క కాస్త గ్యాప్ తీసుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరో గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ వారు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీ కోసం అనుష్క ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు..
అయితే ఈ సినిమా గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూనే వస్తుంది..ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ కూడా చేసారు.దీనితో అనుష్క ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు.అనుష్క ను వెండితెర మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు మళ్ళీ అదే నిరాశ ఎదురయింది.. క్లీన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నా మేకర్స్ మాత్రం విడుదల విషయంలో మాత్రం నిరాశ పరుస్తున్నారు.. ఆగస్టు 4న విడుదల చేస్తామని ముందుగా చెప్పగా మళ్ళీ ఈ సినిమా వాయిదా అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానందున ఆగస్టు 4 న వాయిదా వేస్తున్నాం అని అతి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని వారు తెలిపారు.ఇక విడుదల తేదీ పై తాజాగా నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాను ఆగస్టు 18 న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.