Site icon NTV Telugu

HYD R*APE: హైదరాబాద్‌లో మారని యువతుల తీరు..

Youngwomans

Youngwomans

హైదరాబాద్‌లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. రాత్రి పూట అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలడం లేదు. అలాగే ప్రకాష్ అనే యువకుడు ఓ యువతిని నమ్మించి తన రూమ్‌కు తీసుకు వెళ్లాడు. తర్వాత అఘాయిత్యం చేశాడు. పైగా వాటిని వీడియో తీసి బెదిరించడం మొదలు పెట్టాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. అర్ధరాత్రులు ఇంటి నుంచి బయటకు రావడం.. ఏదైనా అకృత్యాలు జరిగిన తర్వాత పోలీసులను ఆశ్రయించడం కామన్ అవుతోంది. ఎన్నో కేసులు చూస్తున్నా తీరు మార్చుకోవడం లేదు.

Also Read:HYD COUPLE P*ORN: భార్యాభర్తల బంధాన్ని.. అంగట్లో సరుకులా అమ్మేశారు..

ఈవెంట్లలో డాన్సులు చేస్తున్న అమ్మాయిని ట్రాప్ చేసిన యువకుడు

హైదరాబాద్‌లో రాయదుర్గం ప్రాంతం.. ఐటీ ఆఫీసులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడే క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఈవెంట్లలో డాన్సులు చేస్తున్న ఓ అమ్మాయిని యువకుడు ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయి న్యూడ్ వీడియోలు తీసి బెదిరించడం మొదలు పెట్టాడు. రాయదుర్గం ప్రాంతంలో ఓ యువతి వైన్ షాపు ముందు మందు తాగుతోంది. ఈ క్రమంలో కుక్‌గా పనిచేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రకాష్‌ ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఇలా రోడ్డుపై తాగితే మంచిది కాదని చెప్పాడు. దగ్గర్లోనే తన రూమ్‌ ఉందని నమ్మించి వెంట తీసుకెళ్లాడు.

Also Read:CEIR Portal: ఫోన్ పోయిందా నో టెన్షన్..? జస్ట్ ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయండి..

ఇద్దరు కలిసి మద్యం తాగి నిద్రపోయారు. రాత్రి 2 గంటలకు యువతికి మెళకువ రావడంతో లేచింది. ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఉంది. దీంతో ఆ యువతి తనను మోసం చేశావంటూ ప్రకాష్‌‌తో గొడవకు దిగింది. తెల్లవారే వరకు అక్కడే ఉండాలని ప్రకాశ్‌ తన మొబైల్‌లో తీసిన యువతి న్యూడ్‌ ఫొటోలు చూపించాడు ప్రకాశ్. ఒక్కసారిగా షాక్‌కు గురైంది యువతి. అంతే కాదు ఎవరికి చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ ఫొటోలు అందరికి పంపిస్తానని బెదిరించాడు.

Also Read:CEIR Portal: ఫోన్ పోయిందా నో టెన్షన్..? జస్ట్ ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయండి..

సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసి నిందితుడి అరెస్ట్‌

చివరికి ఉదయం అక్కడి నుంచి బయట పడ్డ యువతి ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసింది. తనకు జరిగిన విషయాన్ని విరించింది. అనంతరం రాయదుర్గం పోలీస్ స్టేషన్ చేరుకుంది. అతిగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రులు పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి అమాయక యువతులు కనిపిస్తే ఆగమాగం చేస్తున్నారు. ఐతే అర్ధరాత్రి షీటీమ్స్‌తో మరింత నిఘా పెంచాలని సిటీ జనం కోరుతున్నారు.

Exit mobile version