NTV Telugu Site icon

Botsa Satyanarayana: త్వరలో డీఎస్సీ.. మంత్రి బొత్స కీలక ప్రకటన

Botsa On Dsc

Botsa On Dsc

Botsa Satyanarayana: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో త్వరలోనే విద్యా శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. యూనివర్శిటీలు, ఐఐటీల్లో ఖాళీగా ఉన్న 3,200కు పైగా పోస్టులను కొద్ది రోజుల్లోనే భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని స్పష్టం చేశారు. దాదాపు 18 ఏళ్లుగా వర్శిటీల్లో శాశ్వత పోస్టుల భర్తీ జరగలేదని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ట్రిపుల్ ఐటీల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. యూనివర్సిటీల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తామన్నారు.

Also Read: ACB Court: అరుపులతో దద్దరిల్లిన కోర్టు హాల్.. బెంచ్‌ దిగి వెళ్లిపోయిన జడ్జి

వచ్చే ఎన్నికలకు ముందే డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. డీఎస్సీకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు. ముందు టెట్‌, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని వెల్లడించారు. డీఎస్సీ వివరాలు త్వరలోనే చెప్తామని బొత్స పేర్కొన్నారు. యూనివర్సిటీ ఐఐటీలో ప్రొఫెస్సర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుందన్నారు.

Show comments