Minors Driving: ప్రతిరోజు ప్రపంచంలో నలుమూలల ఏదో ఒక యాక్సిడెంట్ సంబంధించిన వార్తలను మనం వింటూనే ఉంటాం. ఒకరు చేసిన తప్పుదానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు మద్యం సేవించి రోడ్డుమీద మితిమీరిన వేగంతో వెళ్తూ అద్భుతప్పి ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుత రోజుల్లో కొందరు పిల్లలు కూడా కార్లు, బైకులు వేసుకొని రోడ్లపై అటూఇటూ ఇష్టానుసారం వెళ్లడం గమనిస్తూనే ఉన్నాము. ఇలాంటివి ఘటనల వల్ల ఈ మధ్యకాలంలో చాలామంది అమాయకుల ప్రాణాలు పోయిన వార్తలు మనం చాలానే చూశాం. మైనర్ పిల్లలకి వాహనాలు ఇస్తే మాత్రం అది చట్టరీత్యా నేరం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Read Also: Punjab Kings: మాక్స్వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్.. పీఎస్ఎల్ 2025 నుంచి నేరుగా ఐపీఎల్‌కి!
పట్టుమని పదవ తరగతి కూడా చదివి ఉండని పిల్లలు స్కూలుకి బైక్ పై, అలాగే వారే స్వయానా డ్రైవ్ చేసుకుంటూ కార్లలో వెళ్లడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. బైక్ పైన దూసుకు వెళ్లడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం ఇలాంటి ఘటన వల్ల ఎందరో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారి తల్లిదండ్రులు అలా వెళ్తున్న సమయంలో వారికి హెల్మెట్ ఉందా? లేదా? లైసెన్స్ కూడా లేకుండా ఎలా పంపిస్తున్నారో అర్థం కావడం లేదు. మరికొందరైతే, యువకులు రాంగ్ రూట్లో వచ్చి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ముఖ్యమైన నగరాలలో ప్రతినిత్యం కనిపించే దృశ్యాలు ఇవి. ఇలాంటి మైనర్లు నగరంలో తమ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా అమాయకుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు.
Read Also: Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మృతి
కఠిన చట్టాలు లేకపోవడంతో రెచ్చిపోతున్న మైనర్లు వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇతర దేశాల్లో మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకు జరిమానా వేధిస్తున్నారు. అంతేకాకుండా మూడు సార్లు అలా పట్టుపడితే తల్లిదండ్రుల డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇక భారతదేశంలో ఇలాంటి తరహా ఘటనలు జరుగుతున్న కఠినమైన శిక్షలు పెద్దగా కనపరావడం లేదు. వాహనాలను నడిపే మైనర్ కు జరిమానాలతో పాటు తల్లిదండ్రుల పైన యాక్షన్ తీసుకొని ఎలా పోలీసులు కొత్త నిబంధనలు అతి త్వరలో తీసుకురాబోతున్నారు. ఇందులో భాగంగా పైన మైనర్ నడిపిన బండి రిజిస్ట్రేషన్ ఏడాది కాలం పాటు రద్దు చేయడం, అలాగే ఆ మైనర్ కు 25 ఏళ్లు వచ్చేవరకు లైసెన్స్ రాకుండా చేయడం.. ఇంకా మైనర్ తల్లిదండ్రులను కోర్ట్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటి తరహా ఘటనలు పునరావృతం చేయకుండా చూడడం లాంటి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.