TSRTC: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీఎస్ ఆర్టీసీ తెలంగాణ నుంచి 2427 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సులు ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవ క్షేత్రాలకు ఆర్టీసీ సర్వీసులు నడపనుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇప్పటికే ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. శ్రీశైలానికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్ నుంచి ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సు సర్వీస్‌లన్నింటికీ టీఎస్ ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది.
Read Also: Gold Smuggling : కోల్‌కతాలో రూ.14కోట్ల విలువైన బంగారం పట్టివేత
“మహారాత్రి శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 40 ప్రముఖ శైవాలయాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించాం. రద్దీకి అనుగుణంగా మరిన్ని పత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. భక్తులు ఈ ప్రత్యేక సర్వీస్‌లను ఉపయోగించుకుని క్షేమంగా శైవాలయాలకు చేరుకొని.. మొక్కులు చెల్లించుకోవాలి.” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ , సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, కోరారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Read Also: Emotionally Reactive: చిన్న ఎమోషన్‌కు కూడా అతిగా రియాక్ట్ అవుతున్నారా.. అయితే ఇలా చేయండి