వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) మండలం ఏక్మైఈ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించొద్దని మందలించినందుకు మైనర్ బాలుడు ఓవ్యక్తిపై కొడవలితో దాడి చేశారు. ఓ మైనర్ బాలుడికి మద్యం తాగొద్దని గ్రామానికి చెందిన మారెప్ప అనే వ్యక్తి మందలించారు. మారెప్పపై కక్ష పెంచుకున్న బాలుడు కొడవలితో దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పక్కా ప్లాన్ తో కొడవలితో దాడి చేసినట్లు తెలుస్తోంది.
READ MORE: Falcon Group Scam: ఫాల్కన్ గ్రూప్ సీఓఓ ఆర్యన్ సింగ్ అరెస్ట్.. రూ.792 కోట్లకు టోకరా..
కాగా.. రాష్ట్రంలో మైనర్లు మత్తులో తూగుతున్నారు. విచ్చలవిడిగా మద్యం, గంజాయి లభిస్తుండటంతో వాటిని కొనుగోలు చేసి, సేవించి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. మైనర్లకు మద్యం, సిగరేట్లు విక్రయించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నా.. డబ్బుల సంపాదనే ధ్యేయంగా ఉన్న వ్యాపారులు వాటిని పట్టించుకోవడం లేదు. మైనర్లకు మద్యం, సిగరేట్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. మైనర్లకు సిగరేట్లు విక్రయిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
READ MORE: Sonakshi Sinha : అతని వల్లే నేను ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు.. స్టార్ హీరోయిన్ రిప్లై