Site icon NTV Telugu

Vidadala Rajini: 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

Vidadala Rajini On Jagananna Arogya Suraksha

Vidadala Rajini On Jagananna Arogya Suraksha

Vidadala Rajini: జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపైన్ శుక్రవారం(సెప్టెంబర్ 15) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలన్నీ అందించటమే దీని లక్ష్యమన్నారు. 5 దశల్లో ఈ కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో కూడా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తారని చెప్పారు. తొలుత వాలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు వారి పరిధిలోని ఇళ్లను సందర్శించి, ప్రజలందరీకి ఈ కార్య­క్రమం గురించి అవగాహన కల్పిస్తారన్నారు. తొలి దశ వైద్య శిబిరాలు నిర్వహించే పట్టణా­లు/గ్రామాల్లో ముందుగా ఈ క్యాంపెయిన్‌ మొదలవుతుందన్నారు. వైద్య , ఆరోగ్యశ్రీ సేవలు ఎలా వినిగించుకోవాలనేది అవగాహనా, సేవలు అనే దశల వారీగా జరుగుతుందన్నారు. 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. 105 రకాలు మందులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. 3751 కొత్త ప్రొసిజర్స్ తీసుకుని వచ్చామని మంత్రి చెప్పారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ ఓపీలను 2లక్షల 40 మంది ఉపయోగించుకున్నారని స్పష్టం చేశారు.

Also Read: Tirumala: బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు

ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రభుత్వ సిబ్బంది అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత వైద్య శిబిరాల్లో పరీక్షలు చేసి అవసరమైన వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తారు. దీని ద్వారా అరోగ్య సమస్యలు మరింత పెద్దవై, చికిత్సకు లొంగని దశకు చేరకుండా ముందుగానే గుర్తించి, వైద్యం అందించి, ఆరోగ్యవంతులుగా చేయడం సీఎం జగన్‌ చేపట్టిన ఈ కార్యక్రమం లక్ష్యం. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం సేవలను కూడా వివరిస్తారు. అవసర­మైన వారు ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలను ఏ విధంగా పొందాలో తెలియ­జే­స్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.60 కోట్లకు పైగా గృహాల్లో ఆరోగ్యశ్రీ సేవలను వివరిస్తూ ప్రత్యేక బ్రోచర్‌ను వాలంటీర్లు అందజేస్తారు. పథకం కింద ఎన్ని రకాల జబ్బులకు చికిత్స అందిస్తారు, వైద్యం అందించే ఆస్ప­త్రులు, వాటి చిరునామాలు, ఇతర వివరాలు ఉంటాయి. ఇందులో వైద్యులు, ఇతర సి­బ్బంది ప్రజ­లకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. మందులు కూడా ఉచితంగా ఇస్తారు. అవసరమైన వారిని సమీపంలోని పెద్ద ఆస్పత్రులకు పంపించి, ఆరోగ్య శ్రీ పథ­కం ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తారు.

 

Exit mobile version