ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటికే ప్రకటించినట్లుగా బుధవారం నుంచి అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీలో వైద్యరంగం అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు నేడు పథకం అమలు చేశామని మంత్రి తెలిపారు. ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ 16,852 కోట్లు వ్యయం చేశామని ఆయన వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్యం తెచ్చామని మంత్రి పేర్కొన్నారు.
Ponguleti: మాటలు కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి మంత్రివర్గ సమావేశంలో ఆరు హామీలకు ఆమోదం తెలిపిందన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపైన్ శుక్రవారం(సెప్టెంబర్ 15) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలన్నీ అందించటమే దీని లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్ష చేపట్టారు. అనంతరం సీఆర్‌డీఏపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు 8 శాతం పెరిగాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం అమలు, పురోగతిపై ఆయన నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2019-20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు 35 శాతం ఉంటే 2021-22లో 43 శాతం పెరిగాయని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పేదలకు వైద్యఖర్చులు భారం లేకుండా చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అన్ని జిల్లాలు, ఏరియా…