Thummala Nageswara Rao: అసెంబ్లీ సమావేశాలు 7వరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం శాసనసభ ప్రారంభం కాగా స్పీకర్ అనుమతితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. రైతు భరోసా ప్రక్రియపై సభ్యులు సలహాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలను సంక్రాంతి పండుగ నాటికి ఖరారు చేసి అనంతరం రైతు భరోసా చెల్లింపులు జరుపుతామని మంత్రి ప్రకటించారు. ఈ చర్చలో భాగంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వం 2017-18లో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి సీజన్‌కు ఎకరాకు రూ.4వేలు రైతుల ఖాతాల్లో జమ చేసిందని, 2018-19లో ఈ మొత్తాన్ని రూ.5వేలకు పెంచామన్నారు.
Read also: Sritej Health Bulletin : సంధ్య థియేటర్ ఘటన.. మెరుగుపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యం
ఈ పథకంలో పేర్కొన్నట్లు భూమిని సాగుచేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని, అయితే ఈ పథకం అమలులో చాలా తేడా ఉందన్నారు. దీనిని సక్రమంగా అమలు చేసేందుకు వివిధ నిధులను నిర్ణయించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. పలువురు నిపుణులు, రైతుల సలహాలు, సూచనలు తీసుకుని ఈ కమిటీ విధివిధానాలను సిద్ధం చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం జనవరిలో అమలు చేయాలని భావించిన ఈ పథకానికి సంబంధించి సభలోని సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించి.. వీటన్నింటిని క్రోడీకరించి తుది విధివిధానాలు ఖరారు చేసి ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బీమాను సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
Houthi Rebels: ఇజ్రాయెల్ రాజధానిపై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి..