Minister Sridhar Babu: ఎవ్వరిని వదిలి పెట్టం.. కాంగ్రెస్ నేత హత్యపై మంత్రి సీరియస్
- గంగారెడ్డి హత్యపై కాంగ్రెస్ సీరియస్
- మర్డర్ చేసిన వారిని.. చేయించిన వారిని వదలమన్న మంత్రి శ్రీధర్ బాబు
- జీవన్ రెడ్డితో మాట్లాడతామని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్ పై సీరియస్ గా ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మర్డర్ ఎవరు చేసినా.. ఎవరు చేయించినా వదిలేది లేదని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. జీవన్ రెడ్డితో తాను కూడా మాట్లాడతానన్నారు. జీవన్ రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత అని.. ఆయన సేవలను తాము వినియోగించుకుంటామన్నారు. పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించమని తెలిపారు. చనిపోయిన బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
READ MORE: PAC-SEBI: రేపు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్మన్ మాధబి
Also Read
- Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
- Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
- US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ఇదిలా ఉండగా.. నిన్న (అక్టోబర్02)న జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సంతోశ్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టారని.. ఆ తర్వాత కత్తితో పొడిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించినట్లు వెల్లడించారు. ఇక, గ్రామంలో రాజకీయ కక్షలే హత్యకి ప్రధాన కారణమని తెలిసింది. దీంతో జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ్మునిలాంటి వాడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా.. లేదంటే కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని మండిపడ్డారు.
READ MORE:Tuition Teacher: 9 ఏళ్ల బాలికను చెంపపై కొట్టిన టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్తో ప్రాణాపాయ స్థితి..
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!