Vyooham : మూవీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పేరుతో పరిచయం అవసరం లేదు. నిజాన్ని నిక్కచ్చిగా, ముక్కుసూటిగా చెప్పి విమర్శల పాలవుతుంటాడు. ఇక ఈ సెన్సేషనల్ డైరెక్టర్ లేటెస్ట్ గా తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. ఇక ఈ మూవీని రిలీజ్ కాకుండా అడ్డుకోవడానికి చాలా మంది విశ్వప్రయత్నాలు చేశారని, వారందరి ప్రయత్నాలు విఫలయత్నాలు అయ్యాయని ఆ మధ్య ఆయన కామెంట్స్ చేసిన వార్తల్లో నిలిచారు. తాజాగా వ్యూహం మూవీకి సెన్సార్ అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Also:US Baghdad Drone Strike: ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హిజ్బుల్లా కమాండర్ హతం
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ మూవీ రిలీజ్ చేయకుండా చూడాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయంపై ఘాటుగానే డైరెక్టర్ ఆర్జీవీ స్పందించాడు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. అలాగే మా వ్యూహాన్ని ఆపలేరు అంటూ సెటైరికల్ గా ఆ మధ్య ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా.. వ్యూహాం మూవీకి అన్ని అడ్డంకులు తొలిగాయి. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ సాధించింది. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండోసారి సెన్సార్ బోర్డు నుంచి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో ప్రకటించిన విధంగా ఈ నెల 16న విడుదలకు వ్యూహం సినిమా సిద్ధంగా ఉంది.
Read Also:CM Jagan Delhi Tour: హస్తినలో పొలిటికల్ హీట్.. నేడు ఢిల్లీకి సీఎం జగన్