Minister Seethakka: కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్.. 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలంటూ హెచ్చరిక!
- కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్
- 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్
- లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటాయని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగేలా బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ మంత్రి సీతక్క నోటీసు జారీ చేశారు. మంత్రి తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఈ లీగల్ నోటీసును పంపించారు.
అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (TSTS) నిర్వహించిందని, టెండర్ ఈవాల్యుయేషన్ కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ కేటాయించబడిందని నోటీసులో మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే మొత్తం టెండర్ విలువ రూ.44 కోట్లే ఉన్నప్పటికీ.. అందులో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం అసంబద్ధమని, ఇవన్నీ పూర్తిగా ఆధారాలు లేని ఆరోపణలని పేర్కొన్నారు. ఈ విధమైన ప్రచారం తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రగా భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న దుష్ప్రచారానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ నేరుగా బాధ్యత వహించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. 48 గంటలలోపు ఈ పోస్టులను తొలగించి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. లేకపోతే తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని మంత్రి సీతక్క లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. మంత్రి సీతక్క నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!