Minister Seethakka: విధుల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదు.. టార్గెట్ రీచ్ కావాలి
- మధురానగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో..,
- జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం
- జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిని..,
- పని తీరును, పథకాల అమలును సమీక్షించిన మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మధురానగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిని, పని తీరును, పథకాల అమలును మంత్రి సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలకు తానే మంత్రిగా ఉన్నానని అన్నారు. దీంతో గ్రామ అభివృద్ధి నిధులను అంగన్వాడి కేంద్రాల నిర్మాణం కోసం వెచ్చించే అవకాశం దక్కిందని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా సంక్షేమ అధికారి సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.
Thatikonda Rajaiah: అది నాలుకా, తాటి మట్టా.. కడియం వ్యాఖ్యలపై కౌంటర్
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
అంగన్వాడి కేంద్రాల్లో ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా చూసుకోవాలి.. చిన్నారులే ఈ దేశ భవిష్యత్తు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారిని మంచి పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత అంగన్వాడి టీచర్లదేనన్నారు. అధికారులంతా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని తెలిపారు. విధుల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదు.. అధికారులంతా టార్గెట్‌ను రీచ్ కావాలని సూచించారు. త్వరలో జిల్లాలో పర్యటించి సమీక్షలు నిర్వహిస్తానని అన్నారు. సంక్షేమ శాఖలో డీడబ్ల్యూఓ (DWO)లే తమ కలెక్టర్లని తెలిపారు. జిల్లా సంక్షేమానికి మీరే బాసులున్నారు. సమాజంలో పేదలు అత్యంత బలహీనులకు సంక్షేమం అమలు చేసే అవకాశం మీకు దక్కింది.. వారందరినీ మీరు ఆదరించాలని చెప్పారు.
Gun Firing: ముంబైలో విచక్షణారహితంగా కాల్పులు.. ఒకరికి గాయాలు
జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలి.. అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహారం చెక్ చేయాలని మంత్రి సూచించారు. నాసిరకం వస్తువులు వస్తే వెంటనే రిజెక్ట్ చేసి సప్లయర్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలలో పోషకాహార లోపాన్ని అధిగమించేలా పనిచేయాలి.. పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన అభిప్రాయాలను తెలియజేయాలని అన్నారు. బడిబాట తరహాలో ప్రజాప్రతినిధులు, అధికారులు అంగన్వాడి బాట చేపట్టాలిని తెలిపారు. అధికారులంతా సమయపాలన పాటించి జిల్లా సంక్షేమాన్ని నిత్యం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..